పూర్ణమ్మ
A poem by Gurajada Apparao

ఆడపిల్లల పాటలు
పూర్ణమ్మ
మేలిమి బంగరు మెలతల్లారా !
కలువలకన్నుల కన్నెల్లారా !
తల్లులగన్నా పిల్లల్లారా !
విన్నారమ్మా యీకథను.
ఆటలపాటల పేటికలారా !
కమ్మని మాటల కొమ్మల్లారా !
అమ్మలగన్నా అమ్మల్లారా !
విన్నారమ్మా మీరీ కథను.
కొండలనడుమను కోనొకటున్నది;
కోనకి నడుమా కొలనొకటుంది;
కొలనిగట్టునా కోవెలలోపల
వెలసెను బంగరు దుర్గమ్మ.
పూజారింటను పుట్టెను చిన్నది
పుత్తడిబొమ్మా పూర్ణమ్మా;
అన్నల తమ్ముల కనుగై దుర్గకు
